'బోరు' బోరు
అడుగంటుతోన్న భూగర్భజలాలు.. దాహార్తితో ప్రజల పాట్లు
సగటున 3.52 మీటర్లు పడిపోయిన నీటిమట్టాలు..
గ్రేటర్ శివార్లలో భూగర్భ జలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే ఇంకుడు గుంతలు లేని కారణంగా పాతాళగంగ అడుగంటుతోంది. లక్షలాది బోరుబావులు ఒట్టిపోతున్నాయి. 1500 అడుగుల మేర బోర్లు వేసినా నీటిచుక్క జాడ లేదు.
గతేడాది అక్టోబరు చివరితో పోలిస్తే ప్రస్తుతం ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, హయత్‌నగర్, మహేశ్వరం, శామీర్‌పేట్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చందానగర్ తదితర మండలాల్లో నీటిమట్టాలు అనూహ్యంగా పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి సగటున 11.04 మీటర్లు(36 అడుగులు)లోతున నీటినిల్వల జాడ దొరకగా.. ఈసారి 14.56 (47.78 అడుగులు)లోతునకు వెళితే కాని నీటిచుక్క అచూకీ కనిపించడంలేదు. - సాక్షి, సిటీబ్యూరో