హైదరాబాద్: సమ్మె విరమణ విషయంలో జీహెచ్ఎంసీ కార్మికులు ప్రభుత్వం మాట వినడంలేదని కార్మిక, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్మిక సంఘాల నేతలతో బుధవారం మరోసారి చర్చలు జరిపిన మంత్రి.. సారాంశాన్ని మీడియాకు వెల్లడించారు.
కార్మికులు మాట వినకుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పూనుకుంటుదని వివరించారు. మూడు రోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో ప్రమాదకర వ్యాధులు విజృంభిస్తాయనే భయాందోళననలు నెలకొన్నాయి. రాజేంద్రనగర్ లో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురికి డెండ్యూ సొకిందన్నవార్త కలకలంరేపింది.
కార్మికులు మాట వినేలారేరు: సమ్మెపై కార్మిక మంత్రి
Published Wed, Jul 8 2015 8:31 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement