వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ఫోనులో పరామర్శ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. అలాగే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలలోని రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పాత లింగాలలో నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు.