యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు.
సనా (యెమెన్): యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు. మృతులందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి ఉపాధి కోసం యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి పడవ బోల్తా పడినట్టు యెమెన్ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఆఫ్రికా నుంచి వేలాదిమంది యెమెన్కు వలసపోతుంటారు.