
ఐఎస్‌కు 'అపరిచితుడి' చెక్
న్యూఢిల్లీ: ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, వ్యాపార సంస్థల వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేస్తూ ఆ సంస్థలను చికాకు పరుస్తున్న అంతర్జాల ఆకాశరామన్న బృందం (అనానిమస్ గ్రూప్) ఇప్పుడు టైస్టు సంస్థ ఐఎస్‌ఐఎస్ నెట్‌వర్క్‌ను చిన్నాభిన్నం చేసే లక్ష్యంగా చురుగ్గా పనిచేస్తోంది. సామాజిక వెబ్‌సైట్లలో ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ఖాతాలను వెతికిపట్టుకొని వాటిని ఖతం చేయడమే పనిగా పెట్టుకుంది.
ఇప్పటి వరకు అలాంటి 800 ట్విట్టర్ ఖాతాలను, 12 ఫేస్‌బుక్ పేజీలను, 50 ఈ మెయిల్ అడ్రస్‌ల గల్లంతుకు తామే బాధ్యులమంటూ గర్వంగా ప్రకటించుకుంది. వాస్తవానికి టై లింకులు కలిగిన ఖాతాలపై అనానిమస్ గ్రూప్ గత నెలలోనే యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా అలాంటి మరో హెచ్చరిక జారీ చేసింది.
‘మిమ్మల్ని ఓ వైరస్‌లా చూస్తాం. ఆ వైరస్‌కు మేమే చికిత్స చేయగలం. ఇంటర్నెట్ మా చేతుల్లో ఉంటుంది’ అని ఐఎస్‌ఐఎస్ టైస్ట్ సంస్థనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ యూట్యూబ్ ద్వారా ఓ తాజా సందేశాన్ని పంపించింది. ఎవరైనా అభ్యంతరకరమైన సందేశాలను పోస్ట్ చేసినప్పుడు వాటిని వీలైనంత వరకు తొలగించేందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక వెబ్‌సైట్లు ప్రయత్నిస్తాయి. అయితే కోట్లాది మంది ఖాతాదారులపై అనుక్షణం ఓ కన్నేసి ఉంచడం సాధ్యం కావడం లేదని ఆ సంస్థలు వాపోవడమూ తెల్సిందే. ఫిర్యాదులు అందినప్పుడు మాత్రం ఆ సంస్థలు సకాలంలోని స్పందిస్తున్నాయి.
ప్రభుత్వ విభాగాలు, కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ద్వారా కొన్నేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన అనానిమస్ గ్రూప్, జనవరి 12వ తేదీన చార్లీహెబ్డో ఫ్రెంచ్ మ్యాగజైన్‌పై టైస్టులు దాడి చే సిన నాటి నుంచి వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.