ఫ్రాన్సులో మళ్లీ ఉగ్రదాడి?
ఫ్రాన్సులో మరో ఉగ్రదాడి ఘటన శనివారం కలకలం రేపింది. మధ్య ప్యారిస్‌లోని ఒక చర్చిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అక్కడ సెక్యూరిటీ ఆపరేషన్ కొనసాగుతోందని.. అందువల్ల ప్రజలు ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. అయితే ఆపరేషన్ నిర్వహించిన భద్రతా సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని తేల్చింది.
పారిస్‌లో కనీవినీ ఎరగని రీతిలో 2015 నవంబర్ 13న జరిగిన ఉగ్రదాడిలో 130 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఫ్రాన్స్ ప్రభుత్వం నరమేధానికి కారకులైనవానిని కొద్ది గంటల్లోనే మట్టుపెట్టామని ప్రకటించింది.