న్యూయార్క్
రెండు భాషలు మాట్లాడే పిల్లలు సమస్యలను పరిష్కరించడంలో మంచి నేర్పును కలిగి ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. కుంటుంబంలో అనేక భాషలు మాట్లాటడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది ఒకటి కంటేఎక్కువ భావలు మాట్లాడే పిల్లలు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని, వేగంగా స్పందిస్తారని వాషింగ్టన్ యూనివర్శిటీకి కి చెందిన పరిశోధకులు తేల్చారు. ఈ క్రమంలో వారి మెదడు చురుకుగా పని చేస్తుందని చెప్పారు. మెదడు పనితీరు పై చేసిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
11 నెలల మాటలు నేర్చే సమయంలోనే వారి మెదడు లో ఈ మార్పులు చో్టుచేసుకుంటాయని యూనివర్సిటీకి చెందిన నాజా ఫర్జాన్ రెమిరెజ్ పేర్కొన్నారు. ఇంగ్లీష్-మాత్రమే పిల్లలు తో పోలిస్తే స్పానిష్-ఆంగ్ల భాష మాట్టాడే పిల్లల్లో బలమైన మెదడు స్పందనలు ధ్వనులను తాము గుర్తించామన్నారు ఒకే భాష మాట్లాడే కుంటుంబంలో కంటే ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లలు ఇతర విషయాలను తొందరగా నేర్చుకుంటారన్నారు. కొత్త విషయాలను వీరు వేగంగా గ్రహించ గల్గుతారని మరో శాస్త్రవేత్త కౌల్ చెప్పారు. అదే ఒక భాష మాట్లాడే కుంటుంబంలోని పిల్లలు భావాలు 6 నెలల వయస్సులోనే కుంచించుకు పోతాయన్నారు. 11 నెలల వయసు పసి ప్రాయంలో శిశువు మెదడు చుట్టుపక్కల వాతావరణంలో మాట్లాడే ఒకటి రెండు భాషలను నేర్చకునే సామర్థ్యం సమానంగా ఉంటుందని ఫెర్జాన్ రమేజ్ తెలిపారు. చిన్న పిల్లల్లో బహుళ భాషలు నేర్చుకునే సామర్ధ్యం మాత్రమే కాకుండా, అతి చిన్న వయసులోనే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సరైన సమయమని తమ పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ పరిశోధనలో మాగ్నెట్ ఎన్సెఫలోగ్రఫీ(ఎమ్ఈజీ) సాయంతో మెదడు స్పందనలు, నరాల పనితీరును తాము పరిశీలించామన్నారు. ఇంగ్లీష్, ఇంగ్లీష్, స్పానిష్ మాట్లడే వివిధ కుంటుంబాల్లోని 11నెలలు వయస్సుగల పిల్లలపై ఈ పరిశోధనను నిర్వహించామని తెలిపారు. డెవలప్ మెంటల్ సైన్సెస్ అనే జర్నల్ లో పరిశోధనా పత్రం పబ్లిష్ అయింది.