విద్యుత్ తుపాను! | Light-sheet functional imaging in fictively behaving zebrafish | Sakshi
Sakshi News home page

విద్యుత్ తుపాను!

Published Fri, Aug 1 2014 3:06 AM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

విద్యుత్ తుపాను! - Sakshi

విద్యుత్ తుపాను!

మెదడులో ఒకేసారి 80 వేల నాడీకణాలు స్పందిస్తే అచ్చం ఇలాగే.. విద్యుత్ తుపాను చెలరేగినట్లుగా ఉంటుందట. అయితే ఈ ఫొటో మనిషి మెదడుకు సంబంధించినది కాదులెండి.. జీబ్రాఫిష్ మెదడుది. జీబ్రా చేప మెదడులోకి కాంతిని ప్రతిఫలింపచేసే రసాయనాలను ఎక్కించి, తర్వాత దాని మెదడులో జరిగే ప్రతిస్పందనలను ‘లైట్-షీట్ ఇమేజింగ్’ అనే కొత్త టెక్నిక్ ద్వారా లేజర్ కాంతిని ప్రసరింపచేసి రికార్డు చేశారు. దీంతో చేప మెదడులో ఒకేసారి వేలాది నాడీకణాలు స్పందించినప్పుడు ఇలా వేలాది బల్బులు ఒకేసారి వెలిగినట్లుగా విద్యుత్ ప్రసారం జరిగిందట. ఈ రకమైన అధ్యయనం వల్ల జీబ్రా చేప మెదడు రూల్స్ తెలుస్తాయని, అది అటూఇటూ కదిలేందుకు, ఈదేందుకు, వివిధ పనులు చేసేందుకు మెదడులో ఏ భాగంలో, ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకోవచ్చని వర్జీనియాలోని హోవార్డ్ హగ్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement