
సిడ్నీ : ప్రాథమిక పాఠశాలలోని ఇసుక గుంతలో భారీ ఎత్తున పాము గుడ్లు లభించడం కలకలం రేపింది. ఆడుకోవడానికి వెళ్లిన ఓ విద్యార్థికి ఇసుకలో 12 గుడ్లు దొరికాయి. దీంతో ఆందోళన చెందిన పాఠశాల యాజమాన్యం వైల్డ్‌లైఫ్ సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
మరిన్ని గుడ్లు ఉన్నాయనే అనుమానంతో ఇసుక గుంతను తవ్వడం ప్రారంభించారు. మూడు రోజుల పాటు తవ్వకాల అనంతరం అందులో మరో 43 గుడ్లు లభించాయి. అవి ఆస్ట్రేలియాలోనే అత్యంత విషపూరితమైన బ్రౌన్ స్నేక్‌కు చెందినవిగా వైల్డ్‌లైఫ్ సంస్థ వాలంటీర్లు చెప్పడంతో కలకలం రేగింది.
పిల్లలు ఆడుకునే స్థలంలో విషపూరితమైన పాములు తిరుగుతున్నయానే విషయం తెలియగానే అక్కడి వారందరూ ఆందోళనకు గురయ్యారు. దీనిపై మాట్లాడిన వాళ్లందరూ వైల్డ్ లైఫ్ సంస్థ వాలంటీర్ ఒకరు.. ఓ గుడ్డులో పాము పిల్ల కదులుతుండటాన్ని తాను గమనించానని చెప్పారు. అయితే, బ్రౌన్ స్నేక్స్‌పై పరిశోధనలు చేస్తున్న వాళ్లు మాత్రం ఈ జాతికి చెందిన పాములు భూమి లోపల గుడ్లు పెట్టవని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment