
అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 5.4 శాతం పెరిగిందని తాజా సర్వేలో తేలింది. ప్రస్తుతం అమెరికాలో 1,96,271 మంది భారత విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని ‘2018 ఓపెన్ డోర్స్’ నివేదిక వెల్లడించింది. అక్కడ భారత విద్యార్థుల సంఖ్య పెరగడం ఇది వరసగా ఐదో ఏడాదని తెలిపింది. భారత్ కన్నా ముందు ఒక్క చైనా(3.63 లక్షల మంది) మాత్రమే ఉంది.