వ్యర్థాల నుంచి స్వచ్ఛలోహాలు
లండన్: బ్యాటరీ వ్యర్థాల నుంచి వంద శాతం స్వచ్ఛమైన లిథియం, కోబాల్ట్, నికెల్ లోహాలను వెలికితీయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో బ్యాటరీల రీసైక్లింగ్ సులభతరం కానుంది. బ్యాటరీ వ్యర్థాల నుంచి 99.6 శాతం కోబాల్ట్, 99.7 శాతం నికెల్, 99.9 శాతం లిథియం లోహాలను పరిశోధకులు వెలికితీయగలిగారు.
బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు స్వచ్ఛమైనవిగా ఉండాలని, అవే తయారీలో కీలకపాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన నిర్వహించిన లప్పీరంట వర్సిటీ పరిశోధకులు తెలిపారు. కొత్త బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం లోహం స్వచ్ఛతత 99.5 శాతంపైగా లేకపోతే అవి పనిచేయవని సామీ అన్నారు.