'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!' | This bird will out-dance you, because it has a built-in tutu | Sakshi
Sakshi News home page

'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!'

Published Sun, Jan 10 2016 4:55 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!' - Sakshi

'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!'

ఓ పొట్టి పిట్ట ఈకలు మొత్తాన్ని ఓ పొట్టి గౌనులాగా మారుస్తుంది. వెంటనే ఏదో డప్పు నృత్యం వింటున్నట్లుగా లోకాన్ని మర్చిపోయి చిందులేస్తుంది.ఆ డ్యాన్సు చూశారంటే విజిల్ కొట్టకుండా ఆగలేరేమో..

ప్రకృతిని సరిగా పరిశీలించాలేగానీ అందులోని జీవరాశి ముందు మనం నామమాతృలమే అనిపిస్తుంటుంది. అది జీవంలోనూ, జీవన శైలి విషయంలోనూ.. ఎందుకంటే మాట్లాడే శక్తిమనకు అదనంగా ఉందనే విషయం తప్ప మిగితా ఏ అంశాలు చూసుకున్నా.. ఆ జీవరాశి చాలా గొప్పవనే చెప్పకతప్పదేమో. మనం చేసే ఏపనికైనా ఓ క్రమబద్దమైన శిక్షణ అవసరం. అంతటి శిక్షణ పొందినా ఆ నేర్చుకున్న పనిని సరిగా ఎదుటి వ్యక్తికి చూపించలేము. కానీ, పచ్చటి ప్రకృతిలో నివసించే జీవరాశి  మాత్రం మన కళ్లకు చూపించే అంశాలను చూస్తే అబ్బురపడాల్సిందే.

సాధారణంగా నాట్యం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది నెమలినే.. ఆ తర్వాత ఏ ప్రతిష్టాత్మక నృత్యకారిణినో గుర్తుకు చేసుకుంటాం. కానీ, అడవిలో నాట్యం చేస్తూ చక్కటి డ్యాన్సులు కూడా వేయగలిగిన పక్షి ఉందంటే ఆశ్యర్యపోక తప్పదేమో. ఆ పక్షి చూడటానికి కొంచెం ఆకుపచ్చ మరికొంచెం నలుపురంగులో ఉండి.. తలపై సహజ సిద్ధంగా ఉండే రెండు పొడగాటి నెమలిపించంలాంటి ఈకలు ఉండి ముద్దుగా కనిపిస్తుంది. మాములుగా చూస్తే అది ఓ మామూలు పిట్టలా కనిపిస్తుంది. కానీ, దానికిగానీ సంతోషం వేసిందంటే వెంటనే బుల్లి గౌను వేసుకున్న పాపలా మారిపోయి తన కాలినుంచి మెడ వరకు ఉన్న ఈకలు మొత్తాన్ని ఓ పొట్టి గౌనులాగా మారుస్తుంది. వెంటనే ఏదో డప్పు నృత్యం వింటున్నట్లుగా లోకాన్ని మర్చిపోయి చిందులేస్తుంది. ఆ డ్యాన్సు చూశారంటే విజిల్ కొట్టకుండా ఆగలేరేమో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement