అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న టోర్నడోలు | Tornadoes, storms hit Dallas suburbs; 11 people killed | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న టోర్నడోలు

Published Sun, Dec 27 2015 9:12 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న టోర్నడోలు - Sakshi

అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న టోర్నడోలు

టెక్సాస్‌: అగ్రరాజ్యం అమెరికాను భారీ తుఫాన్‌, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఉత్తర టెక్సాస్‌లో తుఫాన్‌, టోర్నడోలు విరుచుకుపడటంతో 11 మంది చనిపోయారు. శనివారం సాయంత్రం తుఫాన్‌లు డల్లాస్ నగరాన్ని ఢీకొన్నాయి. ఇక్కడ వాతావరణం ఇంకా కల్లోలంగానే ఉంది. మృతుల్లో ఎక్కువమంది డల్లాస్‌లోని గార్లాండ్‌ వాసులే. తుఫాన్ కారణంగా మరో 15 మంది గాయపడ్డారని, 600 నిర్మాణాలు దెబ్బతిన్నాయని గార్లాండ్‌లో పోలీసులు తెలిపారు.

కాలిన్‌ కౌంటీలోనూ తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ మరో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడి జనజీవితాన్ని అతలాకుతలం చేసిన తుఫాన్‌ బీభత్సాన్ని అంచనా వేసి.. నష్టాన్ని లెక్కగట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement