ట్రంప్ తరపున బాలీవుడ్ హీరోయిన్ ప్రచారం
భారత దేశంతో సన్నిహితంగా మెలిగే విషయంలో హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ మేలని మనస్వి అభిప్రాయపడింది. వ్యాపారవేత్త అయిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలని ఆమె ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు, హిందువులకు తొలిసారిగా అత్యధిక ప్రాధాన్యం దక్కడం గొప్ప విషయమని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాతో మనస్వి బాలీవుడ్ కు పరిచయమైంది.