కూలిన మిలిటరీ హెలికాప్టర్
బాగ్దాద్: ఇరాక్‌లో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో బుధవారం ఇద్దరు మృతి చెందారు. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
బాగ్దాద్‌కు ఉత్తర దిశగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైజీ పట్టణం సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మొసూల్ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇరాకీ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది.