అంతరిక్షంలో చిత్రమైన పేలుడు! | Unknown blast in the Space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో చిత్రమైన పేలుడు!

Published Sun, Apr 2 2017 3:56 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

Unknown blast in the Space

కనుగొన్న నాసా

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన నాసా పంపిన చంద్ర అబ్జర్వేటరీ కొన్ని చిత్రమైన ఎక్స్‌రే కిరణాలను కనుగొంది. ఇవి పేలుడు ద్వారా సంభవించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధా రణకు వచ్చారు. కానీ ఈ కిరణాలు ఇంతవరకు శాస్త్రవేత్తలు చూడనివని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవి అంతరిక్షంలో ‘చంద్ర డీప్‌ ఫీల్డ్‌ సౌత్‌’ ప్రాంతం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ పేలుడు భూమికి 10.7 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలోని ఓ చిన్న గెలాక్సీలో ఏర్పడి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఈ ఎక్స్‌రే కిరణాలు కొన్ని నిమిషాల పాటు మన పాలపుంతలోని నక్షత్రాలన్నిటికంటే ఎక్కువ శక్తిని విడుదల చేశాయి. ఈ పేలుడు జరిగిన ప్రదేశాన్ని కనుక్కున్నా కచ్చితంగా ఎక్కడ జరిగిందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయామని శాస్త్రవేత్తలు అన్నారు. ఇది తమకు ఓ పజిల్‌లా మారిందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement