రియాద్: వైఫై సర్వీసులను ఇష్టమొచ్చినట్లు వాడితే దొంగతనం కేసుగా గుర్తిస్తామని సౌదీ అరేబియాలో ఫత్వా విడుదలైంది. మరోకరి వైఫై ఉపయోగించడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సౌదీ అరేబియన్ స్కాలర్కు నోటీసులు జారీ చేసింది. సీనియర్ స్కాలర్స్ మండలి సభ్యుడూన అలీ అల్ హకామీ అనే వ్యక్తి ఈ ఫత్వాను విడుదల చేశాడు.
'వైఫై సర్వీసును ఇతరుల అనుమతి లేకుండా.. యజమాని పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైతే ఉపయోగిస్తారో వారు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తిస్తాం. ఈ సదుపాయం పొందుతున్న వ్యక్తి చాలా స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. ఎవరు వైఫై కోసం డబ్బు చెల్లిస్తారో వారు కచ్చితంగా అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలి' అని ఆయన చెప్పారు.
అక్రమంగా వైఫై వాడితే దొంగలేనట!
Published Thu, Jun 2 2016 6:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
Advertisement