
బీజింగ్: ఇప్పటికే ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్నిబీజింగ్‌లో నిర్మిస్తోంది. సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసాధారణరీతిలో సాగుతోన్న ఆ నిర్మాణ పనుల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారీ వ్యయం : బీజింగ్ నగరానికి దక్షిణ దిశలో.. ఆక్టోపస్‌ను తలపించే పువ్వు ఆకారంలో నిర్మిస్తోన్న ఎయిర్‌పోర్టు కోసం చైనా ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.79 వేల కోట్లు!! నిర్మానంలో 57వేల టన్నుల ఉక్కును, 56.5 మిలియన్ క్యూబిక్ ఫీట్ల కాంక్రీట్‌ను వినియోగిస్తున్నారు. 2019 అక్టోబర్ నుంచి విమానాశ్రయం సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 10కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు సరిపడేస్థాయిలో దీనిని నిర్మిస్తున్నారు.
