నీరు లేక నేర్రేలు విడిచిన పొలం
కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద సాగు చేసిన వరికి సాగునీరు లేకపోవడంతో నిట్ట నిలువునా పంటలు ఎండుతున్నాయి. బిల్లుల మంజూరు నిర్లక్ష్యం కావడం మూలంగా కాల్వ ఆధునికీకరణ పనులు ఆలస్యం కావ డంతో ఆయకట్టు కింద ఉన్న బోర్లలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పనులు నిలిపి వేసి ఎండుతున్న పొలాలకు నీరు వదిలి జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. డీ–16 కాల్వపనులు సాగకపోవడంతో ఆదిలోనే రైతులకు గోస పట్టుకుంది.
మరికల్ : కోయిల్‌సాగర్ డీ– 16 కాల్వ కింద 1100 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ఆధునీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.4.60 కోట్లను మంజూరు చేసింది. 6నెల్లల క్రితమే ఈ పనులు ప్రారంభం కావడం జరిగింది. కాల్వ వెడల్పు పనులు పూర్తి కావచ్చాయి. బిల్లుల అల స్యం కారణంగా వంతెనలు, అండర్‌టర్నల్ పనులు ముందుకు సాగడం లేదు.
బోర్లలో తగ్గుతున్న నీటి మట్టం
డీ–16 కాల్వకు కోయిల్‌సాగర్ నీరు విడుదల కాకపొవడంతో కాల్వ కింద ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పూర్తిగా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. పనులు పూర్తి చేసిన వరకైనా నీటిని వదిలితే బోర్లలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసు ్తన్నారు. పనుల నత్తనడకన సాగుతుండటంతో మరో ఎడాది పట్టెటాట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం కాల్వ వెడల్పు పనులు మినహా మిగిత పనులు తూములు, వంతేనాలు, అండర్ టర్నల్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూరైన తర్వా తనే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. బిల్లుల అలస్యం కారణంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు తంటలు పండుతున్నాడు.
నత్తనడకన పనులు
డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి డీ–16 కాల్వకు నీరు వదులుతామని చేప్పిన అధికారులు మాట తప్పారు. దీంతో ఈ కాల్వ కింద సాగు చేసుకున్న వరిపంటలు నీళ్లులేక వందలాది ఎకరాలో వరిపంట ఎండుతుంది. ఇటీవల కాల్వ పనులను పరిశీలించడానికి వచ్చిన అధికారులను డీ–16 రెండవ తూమ్ వరకు నీరు వదాలారు. అక్కడి వరకే నీరు రావడంతో కొంత వరకు పంటలు ఉపిరిపిల్చుకున్నాయి. మిగిత తూమ్‌ల కింద పనులు కొనసాగుతుండటంతో సాగునీరు అందడం లేదు. దీంతో అక్కడి పంటల పరిస్థితి చూస్తే కర్షకులకు కనీళ్లు తెపిస్తున్నాయి.
డీ–16 కాల్వకు నీరు వదలాలి
డీ–16 కాల్వ పనులు ఇపట్లో పూర్తి కావు. ఎండిన పంటలను దృష్టిలో ఉంచుకొని రెండు తడుల నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడకునే అకాశంతో పాటు బోర్లను కాపడుకున్నే అవకాశం ఉంది. అధికారులు నీళ్లు వదాలకుంటే ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి దారిస్తుంది.
– ఆంజనేయులు, రైతు, తీలేర్
ముందే చెప్పాం
డీ– 16 కాల్వ అధునీకరణ పనుల నిమిత్తం ఈ ఆయకట్టు కింద రైతులు ఎవరూ కూడా పంటలను సాగు చేసుకోవద్దాని ముందే చెప్పాం. అయినా కొందరు రైతులు వరిపంటలను సాగు చేసుకున్నారు. వీలైనంత వరకు కాల్వ పనులు పూర్తి చేసిన వరకు ఎండిన పంటలకు నీరు వదిలేందుకు చర్యలు తీసుకుంటాం.
– భూపాల్‌రెడ్డి, కోయిల్‌సాగర్, ప్రాజెక్టు ఈఈ
Comments
Please login to add a commentAdd a comment