విద్యుదాఘాతానికి బాలిక బలి | girl dies of current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి బాలిక బలి

Published Mon, Feb 19 2018 4:55 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

girl dies of current shock - Sakshi

సుజాత మృతదేహం 

బిజినేపల్లి రూరల్‌ (నాగర్‌కర్నూల్‌) : విద్యుదాఘాతానికి గురై ఓ బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని శాయిన్‌పల్లిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మయ్య సాయంత్రం ఎద్దులను తీసుకుని ఇంటికి వస్తుండగా కూతురు సుజాత(17) పొలం దగ్గరకు మోటార్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లింది. మోటార్‌ వేసే సమయంలో ఎర్త్‌ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. కొంతసేపటికి సుజాత ఇంటికి రాకపోవడంతో తిరిగి వెళ్లి చూడగా అక్కడే పడి ఉందని, వెంటనే నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి సుజాత మృతిచెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సుజాతకు పెళ్లి నిశ్చయమై వివాహం జరిగే కొద్దిరోజుల ముందే ఈ సంఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నీటిగుంతలో పడి మహిళ.. 
గద్వాలక్త్రెం : నీటి గుంతలో పడి ఓ మహిళ చెందిన సంఘటన మండలంలోని రేకులపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగు భాగ్యమ్మ(43) ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని పుష్కరఘాటు వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మహిళను కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే నీటిలో మునిగి మృతిచెందింది. గ్రామస్తులు ఆమెను బయటకు తీశారు. భాగ్యమ్మకు ముగ్గురు పిల్లలతోపాటు భర్త వెంకటన్న ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement