రెండో పెళ్లికి రెడీ | Amala Paul ready for second marriage | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి రెడీ

Published Thu, Jun 15 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

రెండో పెళ్లికి రెడీ

రెండో పెళ్లికి రెడీ

ఈడూ జోడూ బాగుంది. చూడచక్కగా ఉన్నారు... అని దర్శకుడు విజయ్‌–అమలా పాల్‌ల పెయిర్‌ని చూసి అనుకోనివాళ్లు లేరు. ప్రేమకు కులమతాలతో సంబంధం లేదంటూ.. ఈ ఇద్దరూ లవ్‌లో పడ్డారు. విజయ్‌ హిందు, అమల క్రిస్టియన్‌. రెండు పద్ధతుల్లోనూ 2014లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాతే మనస్పర్థలు మొదలయ్యాయి. ఇంకేముంది? విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. అమలా పాల్‌ ఫుల్‌గా ప్రొఫెషన్‌లో మునిగిపోయారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అయిపోయారు. విజయ్‌ కూడా దర్శకుడిగా బిజీ. మరి.. పర్సనల్‌ లైఫ్‌ సంగతేంటి? ఆ విషయం గురించి అమలా పాల్‌ దగ్గర ప్రస్తావిస్తూ... పెళ్లి గురించి అడిగితే.. ‘‘తప్పకుండా చేసుకుంటా’’ అని స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌గా ఆన్సర్‌ ఇచ్చేశారు. ‘‘ నేనేం సన్యాసినైపోను. హిమాలయాలకు వెళ్లి మిగిలిన జీవితాన్ని గడపాలనుకోవడం లేదు.

తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమ వివాహం. సమయం వచ్చినప్పుడు నా మ్యారేజ్‌ గురించి అందరికీ తెలుస్తుంది’’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఈ సమాధానం గాసిప్పురాయుళ్లకు విందు అయింది. ‘ఆల్రెడీ అమలా పాల్‌ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తితో చనువుగా ఉన్నందువల్లే విజయ్‌ నుంచి విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. మరి.. అమలా పాల్‌ దీనికి కూడా సూటిగా సమాధానం ఇస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement