బన్నీతో స్వీటీ | Anushka Special song in allu arjun sarainodu | Sakshi
Sakshi News home page

బన్నీతో స్వీటీ

Published Tue, Oct 20 2015 2:42 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

బన్నీతో స్వీటీ

బన్నీతో స్వీటీ

అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి సినిమా సక్సెస్లో అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర కీ రోల్ ప్లే చేసింది. సినిమా ప్రమోషన్తో పాటు మాస్ ఆడియన్స్కు సినిమాను చేరువ చేయటంలో బన్నీదే కీలక పాత్ర. అందుకే అల్లు అర్జున్ చేసిన సాయానికి బదులుగా అనుష్క కూడా బన్నీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ అనుష్కతో ఆ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే వేదం, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించిన బన్నీ, అనుష్క ఒక్క సాంగ్ లో కూడా కలిసి ఆడిపాడలేదు. యోగా బ్యూటీ బన్నీతో కలిసి డ్యాన్స్ చేస్తే సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసాలు  హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఆది ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2016 సమ్మర్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement