సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ | Enter The Dragon Girl Training Clips Released | Sakshi
Sakshi News home page

సినిమా కోసం బ్రూస్‌లీ స్టైల్‌ నేర్చుకుంది

Published Fri, Nov 29 2019 11:37 AM | Last Updated on Fri, Nov 29 2019 11:51 AM

Enter The Dragon Girl Training Clips Released - Sakshi

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఎంటర్ ద గర్ల్‌ డ్రాగన్‌’ చిత్ర టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోనే తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం అని చెప్పుకుంటున్న వర్మ సినిమాలో ఫైట్స్‌ కన్నా ఎక్కువగా మసాలా సన్నివేశాలే ఉన్నాయని చాలా మంది పెదవి విరిచారు. కానీ వీటన్నింటికి సమాధానంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్‌ క్లిప్స్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. సినిమాలోని పోరాట సన్నివేశాలు డూప్‌ కాదని వెల్లడించారు. హీరోయిన్‌ పూజా భాలేకర్‌ తైక్వాండో మార్షల్‌ ఆర్టిస్ట్‌ అని, కానీ బ్రూస్‌లీ స్టైల్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందన్నారు.

ఇక ఈ వీడియోలో పూజా భాలేకర్‌ అంకితభావానికి జనాలు ఫిదా అవుతున్నారు. ట్రైలర్‌ చూసి విమర్శించినవాళ్లు సైతం ట్రైనింగ్‌ వీడియో క్లిప్స్‌ చూసి ఆమె కఠోర సాధనకు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సినిమా కోసం ఎంతగానో కష్టపడిన పూజా భాలేకర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నూతన నటి ఓవైపు అందాల ఆరబోతను, మరోవైపు ఫైట్‌ సీన్లను సమంగా బ్యాలెన్స్‌ చేసినట్లు కనిపిస్తోంది.  ఇండోచైనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement