
ఏ సెలబ్రిటీలైనా బాలీవుడ్ హీరో, హీరోయిన్లను పొగడటం తెలిసిన విషయమే. అదే బాలీవుడ్ టాప్ హీరో ప్రాంతీయ నటుడిని ప్రశంసిస్తే అది సంచలనమే అవుతుంది. తాజాగా హీరో, డ్యాన్సింగ్ స్టార్ హృతిక్ రోషన్.. అల్లు అర్జున్, దళపతి విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం హృతిక్ మంగళవారం చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడి సినిమాల్లో ఆర్టిస్టిక్ టెక్నికాలిటీస్ అంటే చాలా ఇష్టమని, సౌత్ సినిమాల నుంచి ఈ విషయాన్ని బాలీవుడ్ నేర్చుకోవచ్చన్నారు. అనంతరం అల్లు అర్జున్, దళపతి విజయ్ డాన్స్ అద్భుతంగా చేస్తారంటూ ప్రశంసించారు. ‘అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా, స్ట్రంగ్‌గా, స్పూర్తిదాయకంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. (హృతిక్ హాలీవుడ్ ఎంట్రీ..)
అలాగే కోలివుడ్ స్టార్ విజయ్ గురించి ప్రశ్నించగా.. ‘విజయ్ స్టెప్స్ కూడా బాగుంటాయి. నాకు తెలిసి వీరు డ్యాన్స్ చేసే ముందు ఏదో తింటారు. అందుకే అంత ఎనర్జీతో పనిచేస్తారు. ఆ డైట్ ఎంటో తెలుసుకోవాలి’. అని బదులిచ్చారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ మాట్లాడిన ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ‘వార్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న హృతిక్ ఇప్పటి వరకు ఏ సినిమాను ఒప్పుకోలేదు. (పవర్ ప్యాక్‌గా మనోజ్.. ఒకే ఫ్రేమ్‌లో త్రీ షేడ్స్ )
@iHrithik Sir about @alluarjun and @actorvijay Dance. Just Imagine Hrithik Sir and Allu Arjun in a Dance movie. 🔥🔥🔥#AA20 #Super30 #AlluArjun#Mastee #AlaVaikunthapurramuloo pic.twitter.com/l6oxSCbtAH
— अमित (@HRxFan_boy) March 3, 2020