
‘రంగూన్’ క్వీన్...
ఇటీవలే ‘హైదర్’తో సంచలనం సృష్టించిన విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘రంగూన్’ సినిమా చేయడానికి కంగనా రనౌత్ పచ్చజెండా ఊపారు. ఇందులో షాహిద్‌కపూర్, సైఫ్ అలీఖాన్ ముఖ్యతారలు.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటీషు సైన్యానికి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి మధ్య జరిగే యుద్ధంలో తమ వారినే భారతీయులు ఎలా మట్టుపెట్టారనే ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చెప్పనున్నారు విశాల్.