ఇన్‌స్టాతో పూర్తిగా విసిగిపోయాను: పునర్నవి | Punarnavi Bhupalam Says She Takes Break From Instagram Add Stories | Sakshi
Sakshi News home page

నేను విసిగిపోయాను: పునర్నవి

Published Thu, May 7 2020 10:55 AM | Last Updated on Thu, May 7 2020 11:25 AM

Punarnavi Bhupalam Says She Takes Break From Instagram Add Stories - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-3 తెలుగు కంటెస్టెంట్‌గా పునర్నవి భూపాలం హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండని పునర్నవి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కొంతకాలం పాటు యాడ్‌ స్టోరీ పోస్టులను షేర్‌‌ చేయనని తెలిపారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ అనేది  కొన్ని సార్లు విషపూరితమైన సాధనం. నేను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని పునర్నవి తెలిపారు. (భయపెట్టే సిండ్రెల్లా) 

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పునర్నవి స్పందిస్తూ.. ‘సోషల్‌ మీడియాలో పిల్లలు ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’ అంటూ యాడ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. (విష్ణు టిక్‌టాక్‌ వీడియో.. అద్భుతః)

‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవటం కోసమే ఇటువంటి పోస్టులు పెడుతున్నారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఆ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసిన పునర్నవి మళ్లీ యాడ్‌ స్టోరీగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇక దీనిపై సదరు నెటిజన్‌ స్నేహితుడు స్పందిస్తూ.. ‘ మీరు పెట్టిన పోస్ట్‌ వల్ల తల్లిదండ్రుల వద్ద అతని పరువు పోతుంది’ అంటూ కామెంట్‌ చేశారు. దీనిపై స్పందించిన పునర్నవి.. ‘తాను సోషల్‌ మీడియాలోకి  వచ్చింది ఎవరిని దూషించడానికి, నిందించడానికి కాదు’ అని స్పష్టం చేస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌ అనేది  కొన్ని సార్లు విషపూరితమైన సాధనం. నేను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని మరో పోస్ట్‌ చేశారు.  (వ‌చ్చే జ‌న్మ‌లో కూడా ఖాళీ లేదు)

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఉయ్యాలా జంపాలా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో కనిపించిన పునర్నవి తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌-3 పునర్నవి క్రేజ్‌ను‌ మరింతగా పెంచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement