పవన్ కల్యాణ్ పాటకు ఆ హీరో డాన్స్ | Rajasekhar Dances To Pawan's Songs | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పాటకు ఆ హీరో డాన్స్

Published Fri, Nov 13 2015 7:18 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

పవన్ కల్యాణ్ పాటకు ఆ హీరో  డాన్స్ - Sakshi

పవన్ కల్యాణ్ పాటకు ఆ హీరో డాన్స్

హైదరాబాద్:  ఒకపుడు ఆ రెండు సినీ కుటుంబాల మధ్య దాదాపు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం .  మరీ ముఖ్యంగా ఆ టాలీవుడ్ హీరోలిద్దరూ  ఒకరు  ఉప్పు అయితే మరొకరు నిప్పు అన్నట్టుగా   ఉండేవారు.  బహిరంగంగా విమర్శలు చేసుకోవడమే కాదు..  తమ తమ చిత్రాల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసుకునేంతగా.  అయితే కాలక్రమంలో వారిద్దరూ శాంతించినట్టే చెప్పుకోవాలి. ఇపుడు తాజా పరిణామాలు చూస్తోంటే పరిస్థితి మరింత చక్కబడ్డట్టు కనిపిస్తోంది.

అమెరికాలోని  తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు  హాజరైన టాలీవుడ్ హీరో రాజశేఖర్... పవన్ కల్యాణ్ పాటకు డాన్స్ చేశారు. న్యూజెర్సీలో జరిగిన ఈ వేడుకల్లో  స్టేజీపై పవన్  సినిమాల్లోని పాటలకు  చాలా హుషారుగా  స్టెప్స్ వేశారు.  అత్యంత ఉత్సాహంగా జరిగిన   దీపావళి సంబరాల్లో రాజశేఖర్ భార్య  జీవిత, కూతుర్లు శివానీ, శివాత్మిక కూడా  హల్ చల్ చేశారు.

కాగా గతంలో జీవిత రాజశేఖర్ దంపతులపై  చిరంజీవి అభిమానుల దాడి, అనంతరం రాజశేఖర్ దంపతులు మెగా ఫ్యామిలీపై విమర్శలు  గుప్పిస్తూ  కేసు నమోదు చేయడంతో వివాదానికి తెర  లేచింది.  పరస్పర రాజీతో  కొంతకాలం చల్లబడినా అడపా దడపా రగడ రగులుతూనే ఉంది. మళ్లీ ఆ తర్వాత  పవన్ కల్యాణ్ మీద విమర్శలు, పరస్పరం  ఒకర్నొకరు ఇమిటేట్ చేస్తూ సినిమాల్లో సెటైరికల్ సన్నివేశాలు పెట్టడం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement