చెన్నై: మెగాస్టార్ చిత్రంలో సూపర్‌స్టార్ ఉండబోతున్నారు. ఏమిటీ నమ్మసక్యం కావడం లేదా! చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటి నయనతార నాయకిగా నటించింది. ఇక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్ సంచలన నటుడు విజయ్‌సేతుపతి, కన్నడ సూపర్‌స్టార్ సుదీప్, జగపతిబాబు, నటి తమన్నా, అనుష్క వంటి ప్రముఖ నటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి కొడుకు, యువ నటుడు రామ్‌చరణ్ నిర్మింస్తున్న ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఐదు భాషల్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
కాగా షూటింగ్ పూర్తయి నిర్మాణ కార్యక్రమాలు ముగియడంతో ఇందులో నటుడు రజనీకాంత్‌కు పనేముంది అనే సందేహం కలగవచ్చు. కాగా సైరాకు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ వాయిస్‌ను తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఇచ్చారు. ఇక తమిళంలో సూపర్‌స్టార్ ఇస్తే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. రజనీకాంత్, చిరంజీవిల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సైరా చిత్రానికి నేపధ్య వాయిస్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.
అదే విధంగా మలయాళంలో మోహన్‌లాల్, కన్నడం యష్, హిందీలో హృతిక్‌రోషన్‌లతో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా రజనీకాంత్ ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవలే రజనీకాంత్, నయనతారలతో కలసి చిత్ర యూనిట్ జైపూర్‌కు వెళ్లారు. మరి సైరాకు రజనీకాంత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎప్పుడు ఇస్తారో? అన్న ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment