పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవి చిత్రబృందానికి ఆశీస్సులు అందించారు. సాయిధరమ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి రచయిత సత్యానంద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు.
ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన ఆకుల శివ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. సాయిధరమ్ తేజ్ తల్లి విజయదుర్గ స్క్రిప్ట్ అందించారు. ‘‘ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి, పవర్‌ఫుల్ మాస్ సినిమాలకు చిరునామాగా నిలిచే వినాయక్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వేశ్వర్.