పుష్పకు విలన్‌! | Suniel Shetty To Play Villain In Allu Arjun Film Is Pushpa | Sakshi
Sakshi News home page

పుష్పకు విలన్‌!

Published Tue, Apr 14 2020 3:38 AM | Last Updated on Tue, Apr 14 2020 3:38 AM

Suniel Shetty To Play Villain In Allu Arjun Film Is Pushpa - Sakshi

సునీల్‌ శెట్టి

‘దర్బార్‌’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమయ్యారు బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి. ప్రస్తుతం విష్ణు మంచు నటించి, నిర్మిస్తున్న ‘మోసగాళ్ళు’లో ఓ కీలక పాత్ర చేస్తున్న సునీల్‌ తాజాగా తెలుగులో మరో సినిమా కమిట్‌ అయ్యారని సమాచారం. ‘ఆర్య, ఆర్య2’ తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కలసి చేస్తున్న సినిమా ‘పుష్ప’. ఇటీవల ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయిక. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు సునీల్‌ శెట్టిని సంప్రదించారని తెలిసింది. కథ, పాత్ర నచ్చి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement