![Vignesh Shivan Valentines Day Wishes To Nayanthara - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/15/Vignesh-Shivan.jpg1_.jpg.webp?itok=MOz-Ijun)
చెన్నై : దాదాపు ఐదేళ్లుగా ప్రేమ దేశంలో విహరిస్తున్న దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార, తమిళ సంచలన దర్శకుడు విఘ్నేశ్ శివన్ వాలైంటైన్స్ డే వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విఘ్నేశ్ తమ విదేశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. నయన్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్.. 5 ఏళ్ల తమ ప్రేమ ప్రయాణం ఎంతో హ్యాపీగా సాగిపోతోందని ఆనందం వ్యక్తం చేశాడు.
(చదవండి : నయన, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమకథ సినిమాగా..!)
నయన్‌తో తనతో ఉంటే ప్రతిరోజు ‘వాలెంటైన్స్ డే’నే అని రాసుకొచ్చాడు. ‘ఐదేళ్లు నా ప్రపంచంలో అంతా నువ్వే ఉన్నావ్. నీ ప్రేమానురాగాలతో నాకు ప్రతిరోజు వాలైంటైన్స్ డేనే. హ్యాపీ వాలెంటైన్స్ డే నా ప్రియమైన నయన్’అని క్యాప్షన్ జోడించాడు. గత డిసెంబర్‌లో ఈ జోడీ పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆమెపెళ్లి వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ప్రేమ, పెళ్లి విషయాల్లో నయనతార ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. ఆ సంఘటనలు నయన్‌కు చాలా పాఠాలే నేర్పినట్లున్నాయి.
(చదవండి : మళ్లీ ఒంటరైన నయన)
(చదవండి : నయన్ విషయంలోనూ అలాగే జరగనుందా?)
Comments
Please login to add a commentAdd a comment