
విజయ్ దేవరకొండ,రష్మికా మండన్నా
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేస్తోన్న ప్రతి సినిమా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా చూసుకుంటున్నారు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మికా మండన్నా కథానాయిక. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సామాజిక బాధ్యత కలిగిన ఇన్‌టెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మార్చి 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకర్, కెమెరా: సుజిత్ సారంగ్, డైలాగ్స్: జై కృష్ణ.