
భార్యాపిల్లలతో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కెనడా ప్రధాని ట్రూడో
న్యూఢిల్లీ: ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబ సమేతంగా శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. మరుసటి రోజు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు.