
ఇక ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
న్యూఢిల్లీ: ఐపీసీ సెక్షన్ 309ని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఐపీసీ నుంచి ఈ సెక్షన్ను తొలగిస్తే ఆత్మహత్యయత్నం నేరంకాదు. సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్న నేరానికి సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే 1996లో సెక్షన్ 309 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ 309ని తొలగించాలని లాకమిషన్ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ సెక్షన్ను తొలగించే అవకాశాలను పరిశీలించమని సుప్రీం కోర్టు పార్లమెంటుకు సలహా ఇచ్చింది. గతంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటివరకు ఇది చట్టబద్దం కాలేదు. ఈ రోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక కీలక మలుపుగా భావించవచ్చు.
**