జూన్‌ 3న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష | Civils Prelims Exam on June 3 | Sakshi
Sakshi News home page

జూన్‌ 3న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష

Published Wed, Aug 16 2017 12:57 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Civils Prelims Exam on June 3

న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి అధికారుల నియామకం కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 2018 జూన్‌ 3న ఉంటుందని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఫిబ్రవరి 7న నోటిఫికేషన్‌ విడుదలవుతుందనీ, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 6 అని యూపీఎస్సీ పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర అత్యున్నత స్థాయి అధికారుల నియామకానికి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement