కోల్ స్కాంలో సీబీఐ మరో ఎఫ్‌ఐఆర్ | Coal Scam CBI's unother FIR file | Sakshi
Sakshi News home page

కోల్ స్కాంలో సీబీఐ మరో ఎఫ్‌ఐఆర్

Published Sat, May 24 2014 1:35 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

Coal Scam CBI's unother FIR file

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో సీబీఐ తాజాగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాగ్‌పూర్‌కు చెందిన జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్‌తోపాటు మరో అధికారిపై ఈ కేసు పెట్టింది. దీంతో ఈ స్కాంలో ఇప్పటివరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 20కి చేరింది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లోని మంద్ రాయ్‌గఢ్‌లో గారే పల్మా-4 బొగ్గు క్షేత్రం నుంచి అనుమతికి మించి తవ్వకాలు జరిపిందన్నాయి. 2007-08 మధ్య 5.6 లక్షల టన్నుల బొగ్గును కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా  అక్రమంగా తవ్విందని వివరించింది. నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాయ్‌గఢ్‌లలోని ఈ కంపెనీ ఆఫీసుల్లో సీబీఐ సోదాలూ  చేపట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement