
మధ్యప్రదేశ్ సీఎంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
భోపాల్:మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో జరిగిన అవినీతిలో సీఎం హస్తం ఉందంటూ కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణల డాక్యుమెంట్లలో 48 చోట్ల శివరాజ్ సింగ్ పేరు ఉందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది 2013 సంవత్సరంలో విద్యాశాఖలో చోటు చేసుకున్న అవినీతిలో సీఎం ప్రధానపాత్రుడని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ఆ తర్వాత శివరాజ్ ను డాక్యుమెంట్ల నుంచి తప్పించారని మండిపడింది. సీఎం పదవికి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.