
‘ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనేది చెప్తాం’
గోవా: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ గోవాలో జోరు చూపించనుంది. ఎన్నికల తర్వాత గోవా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం స్పష్టం చేశారు. దీంతో గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పిన మాటల్ని అమిత్ షా నిజం చేసినట్లయింది.
గతంలో గోవా పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గోవాకు ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచే వస్తాడని, అయితే, ఆయన ఎవరనే విషయం చెప్పబోమని తెలిపారు. దీంతో మరోసారి ప్రస్తుత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్‌పారికర్‌ను ముఖ్యమంత్రిగా పంపిస్తారని ఊహాగానాలు వచ్చాయి. వాటినే అమిత్ షా తాజాగా ఆమోదించినట్లు తెలుస్తోంది.