యూపీలో గెలుపుపై లాలూప్రసాద్ జోస్యం
యూపీలో గెలుపుపై లాలూప్రసాద్ జోస్యం
Published Fri, Mar 10 2017 8:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
పట్నా: ఎగ్జిట్‌పోల్స్ అసత్యమని మరోసారి రుజువు అవుతుందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఎగ్జిట్‌పోల్స్‌పై మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఖచ్చితంగా కాంగ్రెస్-సమాజ్‌వాదీ కూటమి విజయకేతనం ఎగురువేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నమ్మనని, అవి ప్రతిసారి అసత్యమనే తేలాయని పేర్కొన్నారు. అలాగే ఈసారి కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు విఫలమవుతాయని లాలూ అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనకు ప్రజల నాడీ తెలుసని, యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్-ఎస్పీ కూటమేనని పునరుద్ఝాటించారు.
ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకే వత్తాసు పలికినప్పటికీ, యూపీలో మోదీ గాలి లేదని బీజేపీ నేతలందరికీ తెలుసని లాలూ అన్నారు. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. యూపీలో బీజేపీ ఓడితే మోదీ ప్రభుత్వంపై రాజకీయ ప్రభావం ఉంటుందన్నారు. 2015 బీహార్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ గెలుస్తుందని చెప్పాయని, అయితే జనతాదళ్, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమే గెలిచిందని లాలూ ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీహార్ ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని చానళ్లు బీజేపీ గెలిచిందని అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమికి మద్దతుగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీహార్ సరిహద్దులో ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
Advertisement