రాంచీ: జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఆర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు మంగళవారం సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్న సమయంలో భద్రతా దళాలపై.. మావోయిస్టులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వెంటనే వారిపైకి ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ముగిసిన అనంతరం ఆ ప్రాంతంలో రెండు ఏకే-47 రైఫిల్స్, 303 రైఫిల్, మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు.
బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు..
సాక్షి, విశాఖ: మల్కాన్‌గిరి నుంచి మహా పొదర్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు దగ్ధం చేశారు. తొలుత బస్సును అడ్డగించిన మావోయిస్టులు అందులో నుంచి ప్రయాణికులను దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పంటించారు. బస్సు డ్రైవర్, క్లీనర్ వద్ద సెల్ ఫోన్లు ఉన్నట్టు గుర్తించిన మావోయిస్టులు.. వాటిని తమతో పాటు పట్టుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment