డీజీపీకి బెదిరింపు ఎస్ ఎం ఎస్
డీజీపీకి బెదిరింపు ఎస్ ఎం ఎస్
Published Wed, May 28 2014 8:59 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
మావోయిస్టు మద్దతుదారులు జార్ఖండ్ లో ఏకంగా డీజీపీకే బెదిరింపు ఎస్ ఎం ఎస్ లు పంపించారు. 'నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు ఆపకపోతే నిన్ను, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను చంపేస్తాం' అంటూ జార్ఖండ్ డీజీపీ రాజీవ్ కుమార్ కు మంగళవారం రాత్రి ఎస్ ఎం ఎస్ లు వచ్చాయి.
అంతకు కొన్ని రోజుల ముందే కొందరు ప్రభుత్వాధికారులకు బెదిరింపు ఎస్ ఎం ఎస్ లు వచ్చాయి. పోలీసులు ఇప్పుడు నక్సలైట్లకు సిమ్ కార్డులు సరఫరా చేసిన వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఎస్ ఎం ఎస్ లు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.
దేశంలోనే మావోయిస్టు సమస్యతో అత్యంత ప్రభావిత రాష్ట్రంగా జార్ఖండ్ పేరొందింది. రైల్వే స్టేషన్లపై, రైళ్లపై మావోయిస్టు దాడులు ఆ రాష్ట్రంలో సర్వసాధారణం. ఒక సందర్భంలో ఏకంగా రైలునే హైజాక్ చేశారు మావోయిస్టులు. గత ఏడాది జులై 2 న మావోయిస్టులు పాకుర్ జిల్లా ఎస్ పీని హత్య చేశారు.
Advertisement