నాగ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం | Nag missile test success | Sakshi
Sakshi News home page

నాగ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Sun, Sep 10 2017 3:44 AM | Last Updated on Tue, Sep 19 2017 1:37 PM

Nag missile test success

న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన మూడో తరం ఏటీజీఎం(యాంటీ–ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌) నాగ్‌ పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నాగ్‌ క్షిపణిని రాజస్తాన్‌లోని ఎడారిలో పరీక్షించింది. ఈ ఏడాది జూన్‌లోనూ ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం నాగ్‌ను రెండుసార్లు పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు.  పరీక్షలు సక్సెస్‌కావడంతో భారత్‌కు మరో కొత్త క్షిపణి త్వరలోనే అందుబాటులోకి రానుంది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement