సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు సర్వసన్నద్ధమయ్యాయి. సేనల సన్నద్ధతపై క్షేత్రస్ధాయిలో సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే స్వయంగా లేహ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్‌లో పరిస్థితితో పాటు చైనా సరిహద్దుల్లో భారత సేనల సన్నద్ధతను నరవణే పర్యవేక్షించారు.
మరోవైపు చైనా సరిహద్దుల్లో డ్రాగన్ సేనలకు దీటుగా భారత్ బలగాలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టాయి. చర్చల్లో శాంతి మంత్రం వల్లెవేస్తూ సరిహద్దుల్లో సేనలను మోహరిస్తున్న చైనా కుయుక్తులకు దీటుగా బుద్ధిచెప్పేందుకు భారత్ సైతం సేనలను తరలించింది. చైనా సరిహద్దుల్లో సేనల సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ నరవణే వివరించనున్నారు. చదవండి :రంగంలోకి అమెరికా బలగాలు
Comments
Please login to add a commentAdd a comment