ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుజరాత్ సీఎంలానే వ్యవహరిస్తున్నారని....
సాక్షి, ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుజరాత్ సీఎంలానే వ్యవహరిస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ దుయ్యబట్టారు. పర్భణి జిల్లా విటా ప్రాం తంలో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రచార సభలో మోడీని లక్ష్యంగా చేసుకుని పవార్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రధానిగా యావత్ దేశ ప్రజల హితవు గురించి ఆలోంచించాల్సిన ప్రధాని మోదీ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తూ కేవలం గుజరాత్‌కే పెద్ద పీట వేస్తున్నారని ధ్వజ మెత్తారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు తననే లక్ష్యంగా చేసి మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు కేవలం మహారాష్ట్రలోనే కా దు మోడీ సొంత రాష్ర్టమైన గుజరాత్‌లో కూడా జరుగుతున్నాయి.. దాని గురించి ఎందుకు మోదీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించి రైతుల జీవితాలతో ఆడుకుం దని ఆరోపించారు. తన హయాంలో రాష్ట్రంలో ఉల్లి రైతులకు న్యాయం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న శాసన సభ ఎన్నికల ప్రచా రం వల్ల మహారాష్ట్రకు ఉన్న మంచిపేరు చెడిపోతోందని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహా రాష్ట్ర పేరు బద్నాం చేస్తున్నవారిని బద్నాం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్రంలో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న బీజేపీ కేవలం మూడు నెలల్లోనే ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాజయాన్ని ఎందుకు చవిచూడా ల్సి వచ్చిందని నిలదీశారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు.