న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ అక్టోబరు 31కి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఫారిఖ్ క్షేత్రస్థాయిలో తాను పర్యటించి వచ్చానని, వరద ప్రవాహ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేస్తున్నారని, సంబంధిత వివరాలతో కూడిన అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం అంగీకారం తెలిపింది.
పర్యావరణానికి హాని కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేయగా తాము గతంలోనే చెప్పినట్టుగా ఏ నిర్మాణమైనా తమ తుదితీర్పునకు లోబడి ఉంటుందని జస్టిస్ స్వతంత్రకుమార్ స్పష్టం చేశారు.