
మావోయిస్టుల దాడిలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్న స్థానికులు
దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడలోని బచేలిలో మావోయిస్టులు బస్సుపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటూ ఓ సీఐఎస్‌ఎఫ్ జవాను మృతిచెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత పదిరోజుల్లో దంతెవాడలో మావోయిస్టులు దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 30న మీడియా వర్గాలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలకు నవంబరు 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment