ఎదురు కాల్పుల్లో కోబ్రా జవాన్లకు గాయాలు | Three Cobra jawans injured in encounter with Naxals | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో కోబ్రా జవాన్లకు గాయాలు

Published Tue, Aug 19 2014 10:01 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three Cobra jawans injured in encounter with Naxals

రాయ్పూర్ : మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్గఢ్ దంతేవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం  కూంబింగ్లో పాల్గొని సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి వస్తుండగా  మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఆ దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. తప్పించుకున్న నక్సల్స్ కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement