
జేడీయూ చీఫ్‌గా నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునెటైడ్) పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ పదవీకాలం ముగియడంతో కొత్తగా నితీశ్‌ను ఎన్నుకున్నారు. 2006 నుంచి మూడుసార్లు జేడీ (యూ) అధ్యక్షుడిగా శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. నాలుగోసారి కొనసాగేందుకు ఆయన విముఖత చూపారు. దీంతో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నితీశ్‌ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలసి జేడీ (యూ) అధికారం చేపట్టడంలో నితీశ్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో 2019 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆదరణ తెచ్చేందుకు, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి వీలుగా నితీశ్‌కు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎన్నిక అనంతరం నితీశ్ స్పందిస్తూ ‘శరద్ యాదవ్ నాయకత్వ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని ట్వీట్ చేశారు.