‘దోషి అయితే ఆయనపై సానుభూతి ఉండదు’ | No Sympathy If SP Tyagi Proven Guilty In VVIP Chopper Deal: Arup Raha | Sakshi
Sakshi News home page

‘ఆయనపై మాకేం సానుభూతి ఉండదు’

Published Wed, Dec 28 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

‘దోషి అయితే ఆయనపై సానుభూతి ఉండదు’

‘దోషి అయితే ఆయనపై సానుభూతి ఉండదు’

న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న భారత మాజీ వైమానిక దళ చీఫ్‌ ఎస్పీ త్యాగి తమ కుటుంబ సభ్యుడులాంటి వాడేనంటూ వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత భారత వైమానిక దళ చీఫ్‌ అరూప్‌ రహా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అగస్టా స్కాంలో త్యాగి నిజంగానే దోషిగా తేలితే ఆయనపై తమకు ఎలాంటి సానుభూతి ఉండబోదని చెప్పారు.

‘వైమానిక దళ మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగి తమ కుటుంబంలో సభ్యుడే. అలాంటి వ్యక్తిపై కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట మేమంతా ఉంటాం. ఒక వేళ ఆయన దోషిగా తేలితే.. ఆయనపై ఇలాంటి సానుభూతి మాత్రం ఉండబోదు’ అని రహా చెప్పారు. ఎలాంటి ఆరోపణలు నిరూపితమూనా, ఎలాంటి శిక్షలు ఉన్నా తాము వాటికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఆర్మీ విషయంలో ఎవరూ తప్పుడు చర్యలకు పాల్పడినా అది చాలా చెడ్డపనిగానే భావిస్తామని, అందులో చిన్నాపెద్ద అనే తేడా ఉండదని అన్నారు.  
 

Advertisement

పోల్

Advertisement