'కోర్టు ఆదేశాలతో ఇబ్బంది పడలేదు'
సుప్రీంకోర్టు తనను 2జీ స్కాం విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆదేశించినందుకు తానేమీ ఇబ్బంది పడలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. ఇందులో ఇబ్బందేమీ లేదని, తాను కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తానని ఆయన చెప్పారు.
తనకు తానుగా ఈ కేసు విచారణ, దర్యాప్తు బాధ్యతల నుంచి రంజిత్ సిన్హా తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. డైరెక్టర్ తర్వాత సీనియర్ అధికారి ఎవరైతే వాళ్లు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టాలని కోర్టు తెలిపింది.